విజయ్, పూరి సినిమా అప్డేట్..!

  • Written By: Last Updated:
విజయ్, పూరి సినిమా అప్డేట్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి తో కలిసి పూరిజగన్నాథ్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయినట్టు సమాచారం. విజయ్ ఈ సినిమాలో ఫైటర్ గా కనిపించనున్నారు. దానికోసం ఇప్పటికే మరింత ఫిట్నెస్ ను పెంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై చిత్ర యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు విడుదల చేస్తామని ప్రకటించింది. సినిమాకు భాషా బేధాలు ఉండవని…మంచి కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారని అధికారిక ప్రకటన విడుదల చేసారు.

ఈ ప్రకటన ను హిందీలో సినిమాను విడుదల చేస్తున్న ధర్మ ప్రొడక్షన్ తో పాటు…పూరి కనెక్ట్స్ వారు రిలీజ్ చేశారు. విజయ్ పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా టైటిల్ ను “ఫైటర్” అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ కు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశారో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

follow us