నాని డైరెక్టర్ ను నమ్ముకున్న విజయ్ దేవరకొండ ..?

నాని డైరెక్టర్ ను నమ్ముకున్న విజయ్ దేవరకొండ ..?

విజయ్ దేవరకొండ కెరియర్ అయోమయంలో పడిపోయింది. కెరియర్ మొదట్లో వరుస రెండు హిట్లు పడేసరికి మనోడు ఆగలేదు. ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడ్డప్పటికీ మనోడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ తో విజయ్ అయోమయంలో పడిపోయాడు. పూరి డైరెక్షన్లో తెరకెక్కిన లైగర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఎంతో చెప్పుకొచ్చాడు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాదు పూరి , ఛార్మీలను తీవ్ర నష్టాలపాలుచేసింది.

ఇదే అనుకుంటే..శివ నిర్వాణ డైరెక్షన్లో మొదలుపెట్టిన ఖుషి మూవీ సైతం ఆగిపోయింది. హీరోయిన్ సమంత అనారోగ్యానికి గురి కావడం తో సినిమా షూటింగ్ ను ఆపేసారు. ఈ క్రమంలో కొత్త కథలపై దృష్టి సారించాడు విజయ్. ఈ క్రమంలో నాని జర్నీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాలనీ విజయ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ముందు ఈ మూవీని దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారి చేతికి వెళ్లినట్టుగా సమాచారం. సమంత కోలుకుని సెట్ లో కి ఎంట్రీ ఇవ్వడానికి సమయం పడుతుందని గ్రహించిన విజయ్ ఈ సమయంలో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం.

follow us