కొరటాలకు నో చెప్పిన విజయ్ దేవరకొండ.?

VIJAY DEWARAKONDA REJECTS KORATA PROPOSAL
VIJAY DEWARAKONDA REJECTS KORATA PROPOSAL

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా కంటే ముందు చేసిన పెళ్లి చూపులు సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అర్జున్ రెడ్డి మాత్రం రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. అంతే కాకుండా యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో ప్యాన్ ఇండియా సినిమా లైగర్ లో హీరోగా నటిస్తున్నాడు. అంతే కాకుండా మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం రౌడీ హీరో కొరటాలకు నో చెప్పాడట.

ఇప్పటివరకు దర్శకత్వం మాత్రమే చేసిన కొరటాల ఇప్పుడు నిర్మాణ రంగంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా కోసం హీరోగా నటించేందుకు కొరటాల విజయ్ ని సంప్రదించారట. కానీ విజయ్ కథ వినకుండా కొరటాలకు నో చెప్పేసాడట. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని అవి పూర్తవ్వాలంటే 2-3 ఏళ్ళు పడుతుందని విజయ్ ఈ ఆఫర్ కు నో చెప్పాడట. దాంతో కొరటాల ఈ సినిమా కోసం మరో హీరోను వెతికేపనిలో పడ్డట్టు తెలుస్తోంది.