విజయ్ ‘వారీసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి..

విజయ్ ‘వారీసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి..

తమిళ్ హీరో విజయ్ నటిస్తున్న మూవీ ‘వారీసు’ , తెలుగు లో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతుంది. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో తెలుగు,తమిళ్ లో ఏక కాలంలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక శనివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ స్థాయిలో ప్లాన్ చేశారు.

దాదాపు రెండేళ్ల విరామం తరువాత విజయ్ పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొంటుండటంతో ఈ ఈవెంట్ కి అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యారు. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఒక్కసారిగా వందల సంఖ్యలో ఫ్యాన్స్ విరుచుకుపడటంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ దశలో అడ్డుగా వున్న పోలీస్ సిబ్బందిని సైతం తోసుకుంటూ అభిమానులు లోనికి వెళ్లేందుకు పరుగులు పెట్టారు. దీంతో వారికి ఎదురుగా వున్న కొంత మంది పోలీస్ సిబ్బంది కిందపడిపోయి తొక్కీసలాటకు గురయ్యారు. ఇందులో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలు కాలయ్యాయి. ఇందుకు సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

follow us