మనం సీక్వెల్ ఉందా ? లేదా ? అక్కినేని అభిమానుల్లో టెన్షన్

  • Written By: Last Updated:
మనం సీక్వెల్ ఉందా ? లేదా ? అక్కినేని అభిమానుల్లో టెన్షన్

అక్కినేని ఫ్యామిలీ అంత కలిసి నటించిన చిత్రం “మనం”. అక్కినేని ఫ్యామిలి కి జీవితకాలం గుర్తుండి పోయే చిత్రాన్ని అందించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్. ద గ్రేట్ లెజండరి యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కి అది చివరి చిత్రం. గత కొంతకాలంగా మనం సినిమాకు సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ విక్రమ్ నుండి ఎలాంటి సమాదానం మాత్రం లేదు.

అక్కినేని అభిమానులు ఇదే విషయంపై సోషల్ మీడియా వేదిక ప్రశ్నిస్తున్న దర్శకుడు వాటిని దాటేస్తూ వస్తున్నాడు. అసలు మనం స్క్రిప్ట్ పూర్తి చేశాడా లేదా. ఆ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నడా లేడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల నాగచైతన్య తో, విక్రమ్ ఓ సినిమా కథ గురుంచి చర్చించిన, మనం సినిమా కు సంబందించిన సీక్వెల్ ను మాత్రం వారిద్దరీ మధ్యలో తీసుకురాలేదు.

సమంత కూడా ఈదే విషయంపై విక్రమ్ కె కుమార్ ను ఓ సందర్భంలో ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మనం సీక్వెల్ కు మంచి స్క్రిప్ట్ ను రెడీ చేస్తే అక్కినేని ఫ్యామిలీ మరోసారి మీరు మంచి హెల్ప్ చేసినట్లు అవ్వుతుందని, వారి అభిమానుల కోరిక కూడా అదే అని సామ్ అన్నారు. విక్రమ్ మాత్రం నాగచైతన్య కోసం ఓ సబ్జెక్ట్ ను రెడీ చేసుకున్నాడు కానీ ఆ చిత్రం సీక్వెల్ గురుంచి మాత్రం అప్డేట్ లేదు. విక్రమ్, నాని గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత నాగ చైతన్య తో థ్యాంక్యూ మూవీని చెయ్యనున్నాడు. అభిమానుల కోసం అయిన మనం సీక్వెల్ గురుంచి విక్రమ్ కె కుమార్ నుండి అప్డేట్ వస్తుందని ఆశిద్దాం

follow us