సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్

సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ..సంయుక్త మీనన్ జంటగా . శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా గా ఏప్రిల్ 21, 2023న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసారు.

ఇక ఈ టైటిల్ గ్లింప్స్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత ఆసక్తి నింపింది. గంభీరమైన స్వరంతో అతడు ‘అజ్ఞానం భయానికి మూలం.. భయం మూఢ నమ్మకానికి కారణం.. ఆ నమ్మకమే నిజమైనప్పుడు.. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు.. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం’ అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా ఉంది. ఇక, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.

follow us