అక్కా ఆ ఫోటోలు పెట్టొద్ద‌న్న నెటిజ‌న్…విష్ణు ప్రియ రిప్లై ఇది..!

  • Written By: Last Updated:
అక్కా ఆ ఫోటోలు పెట్టొద్ద‌న్న నెటిజ‌న్…విష్ణు ప్రియ రిప్లై ఇది..!

ప్రస్తుతం బుల్లితెరపై యాంకరింగ్ చేసే భామలు కూడా సెగలు రేపే ఫోటోలు పెడుతూ యువతకు మత్తక్కిస్తున్నారు. అలా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్న యాంకర్ విష్ణు ప్రియ. విష్ణు ప్రియ సుదీర్ తో కలిసి చేసిన “పోవే పోరా” అనే షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ షో తరవాత బుల్లి తెరపై మంచి ఆఫర్లు దక్కించుకుంది. ఇక ఈ భామకు సోషల్ మీడియాలోనూ అభిమానులు ఎక్కువే. అయితే ఈ మధ్య మాత్రం ఫోటో షూట్ లతో రెచ్చిపోతోంది. కాగా తాజాగా విష్ణుప్రియ పెట్టిన ఓ ఫొటోకు ఇలాంటి ఫోటోలు పెట్టవద్దంటూ నెటిజన్ కోరారు. అయితే విష్ణుప్రియ మాత్రం అతడికి షాకింగ్ రిప్లై ఇచ్చింది. “అక్కా మా ముఖాలు చూపించలేకపోతున్నాం.

మీ ప్రియా అక్క అలాంటి ఫోటోలు పెడుతుందేంటని అడుగుతున్నారు” అంటూ కామెంట్ పెట్టాడు. దానికి విష్ణు ప్రియ రిప్లై ఇస్తూ…నానా దియా.. నువ్వు రాయిలో కూడా దేవుడిని చూడవచ్చు. అదంతా చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే నా వృత్తిలో రకరకాల బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. అంతమాత్రాన నన్ను తప్పుగా అర్థం చేసుకోనవసరం లేదు. దీన్ని అర్థం చేసుకునే శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ విష్ణు ప్రియ రిప్లై ఇచ్చింది. ఇక విష్ణు ప్రియ రిప్లైతో నెటిజ‌న్ కు దిమ్మ తిరిగినంత ప‌నైంది.

follow us