వైభవంగా గుత్తా జ్వాలా విష్ణు విశాల్ పెళ్లి వేడుక..!

  • Written By: Last Updated:
వైభవంగా గుత్తా జ్వాలా విష్ణు విశాల్ పెళ్లి వేడుక..!

ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ జంట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వేల ప్రియుడిని విడిచి ఉండలేకపోతున్నా అంటూ గుత్తా జ్వాల పోస్ట్ పెట్టడం తో వీరి రిలేషన్ బయటపడింది. దాంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇక ఎట్టకేలకు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. గుత్తా జ్వాల బ్యాట్మింటన్ క్రీడాకారిణి కాగా విష్ణు విశాల్ తమిళం ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవల రిలీజ్ అయిన అరణ్య సినిమాలోనూ విష్ణు విశాల్ కీలక పాత్రలో నటించారు.

ఇదిలా ఉండగా విష్ణు విశాల్ మరియు గుత్తా జ్వాలా ఇద్దరికి కూడా ఇది రెండో వివాహమే. గుత్తా జ్వలా 2005లో చేతన్ ఆనంద్ అనే బ్యాట్మింటన్ క్రీడాకారుడిని పెళ్లి చేసుకుంది. అయితే ఏవో కారణాల వల్ల ఇద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు విష్ణు విశాల్ కూడా 2010 లో రజనీ నటరాజన్ ను వివాహం చేసుకున్నాడు. విష్ణు విశాల్ కు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా 2018లో విడాకులు తీసుకున్నారు.

follow us

Related News