విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ డిసెంబర్ 2న విడుదల

  • Written By: Last Updated:
విష్ణు విశాల్  ‘మట్టి కుస్తీ’ డిసెంబర్ 2న విడుదల

హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎఫ్‌ఐఆర్’ తర్వాత రవితేజతో విష్ణు విశాల్‌కి ఇది రెండో బ్యాక్ టు బ్యాక్ అసోసియేషన్. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

మేకర్స్ తాజాగా సినిమా విడుదల తేదిని ప్రకటించారు. ‘మట్టి కుస్తీ’ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఫిరోషియస్ లుక్ లో ఐశ్వర్య కుర్చీపై కూర్చుని ఉండగా, విష్ణు విశాల్ ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్ ద్వారా మేకర్స్ సినిమాలోని యాక్షన్, రొమాంటిక్ సైడ్స్ చూపించారు. రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాలో స్త్రీ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

హై యాక్షన్‌తో కూడిన ఈ సినిమాలో విష్ణు విశాల్ రెజ్లర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు.

follow us