ఎన్టీఆర్ తన ఇస్ప్సిరేషన్ అంటున్న యంగ్ హీరో..!

సాధారణంగా ఒక హీరో మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే సమాధానం చెప్పడానికి ఎంతో ఆలోచిస్తుంటారు. లేదంటే బాలీవుడ్ హీరోల పేర్లు, హాలీవుడ్ హీరోల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ అంటూ సమాధానం ఇస్తుంటారు. తాజా అలీతో జాలీగా షోకు వచ్చిన విశ్వక్ సేన్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తాను విజయ్ దేవరకొండ పై కామెంట్స్ చేశానని అనుకున్నారని కానీ తాను ఎవరిని ఉద్దేశించి కూడా కామెంట్స్ చేయలేదని చెప్పారు.
తాను చిన్న వయసులో ఉన్నప్పుడు ఓ షూటింగ్ స్పాట్ కు వెళితే ఆలీగారే దగ్గరకు పిలిచి బాగున్నాడు సినిమాల్లోకి పంపించడని నాన్నకు సలహా ఇచ్చారని చిన్న నాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా షోలో మీ ఫేవరెట్ హీరో ఎవరని ప్రశ్నించగా విశ్వక్ సేన్ ఎన్టీఆర్ అంటూ సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా ఎన్టీఆర్ తన ఇన్స్పిరేషన్ అని చెప్పారు. గతంలోనూ విశ్వక్ సేన్ ఓ ఇంటర్యూలో తన ఫేవరెట్ డ్యాన్సర్..వన్ టేక్ యాక్టర్..ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ అంటూ సమాధానం ఇచ్చారు.