వాల్తేర్ వీరయ్య సెన్సార్ పూర్తి

వాల్తేర్ వీరయ్య సెన్సార్ పూర్తి

మెగా-మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న వాల్తేర్ వీరయ్య సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆచార్య తో ప్లాప్ , గాడ్ ఫాదర్ తో యావరేజ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ఇప్పుడు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి బరిలో రాబోతున్నారు. ఇప్పటికే దేవి అందించిన సాంగ్స్ ఓ రేంజ్ లో ఉండగా..పాత్రల తాలూకా స్టిల్స్ , మేకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి.

బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన మేకర్స్..సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. సినిమా చూసిన సెన్సార్ యూనిట్..సినిమాకు యూ / ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారట. సినిమా ఓ రేంజ్ లో వచ్చిందని , మెగాస్టార్ మరోసారి కుమ్మేసాడని , రవితేజ రోల్ సినిమాలో హైలైట్ గా నిలువబోతుందని , చిరు యాక్షన్ తో పాటు డాన్సులు ఇరగదీశాడని సెన్సార్ సభ్యులు తెలిపినట్లు తెలుస్తుంది. సెన్సార్ టాక్ తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక సెన్సార్ కు సంబదించిన అధికారిక ప్రకటన మరికాసేపట్లో రానుందని వినికిడి.

ఇక సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య తో పాటు నందమూరి బాలకృష్ణ – క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కిన వీరసింహ రెడ్డి , తమిళ్ హీరో విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన వారసుడు మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ మూడు చిత్రాల ఫై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి వీటిలో ఏ సినిమా ఫై చేయి సాదిస్తుందనేది చూడాలి.

follow us