నిజంగా దేవి పూనకాలు తెప్పించాడా..?

నిజంగా దేవి పూనకాలు తెప్పించాడా..?

గత కొద్దీ కాలంగా దేవి హావ బాగా తగ్గింది. థమన్ జోరు ముందు దేవి కనిపించకుండా పోయాడు. ఒకప్పటిలా దేవి సాంగ్స్ ఊపు తెప్పించలేకపోతున్నాయి. అంతే కాదు దేవి మ్యూజిక్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో దేవి – చిరు కాంబో లో వాల్తేర్ వీరయ్య తెరకెక్కింది. బాబీ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రంలోని ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ అంచనాలు రెట్టింపు చేస్తున్నారు. ఇప్పటికే బాస్ సాంగ్ , శ్రీదేవి , టైటిల్ సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి. ఈ క్రమంలో చిరు – రవితేజ లపై తెరకెక్కిన నాల్గో సాంగ్ ఓ రేంజ్ లో ఉండబోతుందని , పూనకాలు తెప్పించడం ఖాయమని చెప్పుకుంటూ వచ్చారు చిత్ర యూనిట్. ఈరోజు శుక్రవారం ఆ సాంగ్ రిలీజ్ చేసారు. కానీ ఈ సాంగ్ మేకర్స్ చెప్పినట్లు పూనకాలు తెప్పించే రేంజ్ లో లేదని మ్యూజిక్ లవర్స్ అంటున్నారు.

‘ఈ పూనకాలు లోడింగ్’ పాటకు దేవి శ్రీ లిరిక్స్ అందించగా.. ప్రముఖ ర్యాపర్,బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ అయిన రోల్ రైడా డిజైన్ చేశాడట. ట్యూన్ బాగానే ఉంది. ఈ పాట చిరు- రవితేజ కాంబినేషన్లో చిత్రీకరించారు. ఇద్దరూ కలిసి ఈ పాటలో డాన్స్ చేస్తున్నట్లు తెలిపి ముందు నుండి ఈ పాట పై హైప్ ఏర్పడేలా చేశారు. అదీ బాగానే ఉంది. కానీ తీరా పాట ఏమాత్రం క్యాచీగా లేకపోగా.. గందరగోళానికి గురి చేసే విధంగా ఉండడంతో అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు. మరి స్క్రీన్ ఫై ఎలా ఉంటుందో చూడాలంటున్నారు.

follow us