రేపు మెగా – మాస్ రాజా ఫ్యాన్స్ కు పూనకాలే

మెగా అభిమానులు – మాస్ రాజా అబిమానులు పూనకాలు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే గత కొద్దీ రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలు సిసలైన సాంగ్ రాబోతుంది. మెగా స్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో తెరకెక్కిన వాల్తేర్ వీరయ్య సాంగ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరు – ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ..వీరిద్దరి కలయికలో బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేర్ వీరయ్య రాబోతుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఇప్పటికే దేవి శ్రీ అందించిన సాంగ్స్ ఒక్కోటి ఒక్కో రేంజ్ లో ఊపేస్తుండగా…రేపు చిరంజీవి – రవితేజ కలయికలో తెరకెక్కిన సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
బాయ్స్ అండ్ గర్ల్స్ మెగా మాస్ మోడ్ లోకి సిద్ధమైపోండి.. అంటూ.. ‘మెగాస్టార్ X మాస్ మహారాజా = పూనకాలు లోడింగ్ ‘ సాంగ్ అంటూ మేకర్స్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ అప్డేట్ చూసి ఎప్పుడెప్పుడు సాంగ్ విందామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఏ సమయానికి రిలీజ్ చేస్తారో ప్రకటించలేదు. ఇక చిరంజీవి – రవితేజ గతంలో శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ వేశారు. ఇప్పుడు మరోసారి చిందులేయబోతున్నారు.