జనవరి 13 న వస్తున్న వాల్తేర్ వీరయ్య

జనవరి 13 న వస్తున్న వాల్తేర్ వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయిక రాబోతున్న వాల్తేర్ వీరయ్య ..జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు మైత్రి మూవీ మేకర్స్. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరంజీవి..వాల్తేర్ వీరయ్య గా అసలైన యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే బాస్ సాంగ్ సరికొత్త ట్రెండ్ సెట్ చేయడమే కాదు అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్లింది.

ఇక సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య తో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహ రెడ్డి గా జనవరి 11 న వస్తుండగా..జనవరి 12 న విజయ్ వారసుడు వస్తున్నాడు. మరి ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాదిస్తుందనేది చూడాలి. ఇక వాల్తేర్ వీరయ్య విషయానికి వస్తే చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.

follow us