వాల్తేర్ వీరయ్య ట్రైలర్ టాక్ : రికార్డ్స్ లో పేరు ఉండడం కాదు..వీరయ్య మీదే రికార్డ్స్ ఉంటాయి

వాల్తేర్ వీరయ్య ట్రైలర్ టాక్ : రికార్డ్స్ లో పేరు ఉండడం కాదు..వీరయ్య మీదే రికార్డ్స్ ఉంటాయి

మెగా , మాస్ రాజా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న అసలు సిసలైన ట్రైలర్ వచ్చేసింది. వాల్తేర్ వీరయ్య అంటూ పూనకాలు తెప్పించే ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ , ప్రతి ఫైట్ , ప్రతి మూమెంట్ థియేటర్స్ లలో దుమ్ములేపేలా ఉన్నాయి.

ఆచార్య తో ప్లాప్ , గాడ్ ఫాదర్ తో యావరేజ్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ఇప్పుడు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి బరిలో రాబోతున్నారు. ఇప్పటికే దేవి అందించిన సాంగ్స్ ఓ రేంజ్ లో ఉండగా..పాత్రల తాలూకా స్టిల్స్ , మేకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా శనివారం రిలీజ్ చేసిన ట్రైలర్ మరో రేంజ్ లో ఉంది. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసింది. ఈరోజు శనివారం విడుదల చేసిన ట్రైలర్ చూస్తే…ఓ గ్యాంగ్ లీడర్ , ముఠామేస్త్రి సినిమాలను మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ రేంజ్ లో చిరంజీవి మాస్ దూకుడు చూపించాడు. అతడొక డ్రగ్ స్మగ్లర్.. డిపార్ట్ మెంట్ డేటా బేస్ లో అతడొక పాపులర్ ఖైదీ.. హీ ఈజ్ ఏ మాన్ స్టర్…అంటూ ట్రైలర్ మొదలైంది. “నీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు. మీరే నా ఎర.. నువ్వే నా సొర!“ ” మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన్ను సూసే…! అంటూ వస్తున్న ఒక్కో డైలాగ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలే అనిపిస్తుంది. రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు..రికార్డుసే నా పేరు మీద ఉంటాయి అంటూ చిరు చెపుతుంటే గూస్ బంప్స్ పుట్టిస్తుంది.

అంతే కాదు కేవలం యాక్షన్ మాత్రమే కాదు రొమాంటిక్ యాంగిల్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.చిరంజీవి- శ్రుతి నడుమ కామెడీ సన్నివేశాలు రొమాన్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ మరో లెవల్లో ఉంది. రవితేజ ఎంట్రీనే ఇరగదీశాడు. వైజాగ్ సిటీలో అరాచకాల్ని ఆపేందుకు వచ్చే పోలీస్ కమీషనర్ గా రవితేజ కనిపించారు. హలో బాసూ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో! అంటూ గ్యాంగ్ లీడర్ డైలాగ్ ని రవితేజ పలుకుతుంటే థియేటర్స్ లో ఈలలతో మారుమోగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , బాబీ డైరెక్షన్ , మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఇలా అన్ని కూడా ఓ రేంజ్ లో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో మెగా యాక్షన్ కుమ్మేయడం ఖాయం గా కనిపిస్తుంది.

follow us