టికెట్స్ ధర : వాల్తేర్ వీరయ్య vs వీర సింహ రెడ్డి

టికెట్స్ ధర : వాల్తేర్ వీరయ్య vs వీర సింహ రెడ్డి

సంక్రాంతి బరిలో భారీ అంచనాల మధ్య వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న వాల్తేర్ వీరయ్య ఫై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే దేవి శ్రీ అందించిన సాంగ్స్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడం , ధమాకా తర్వాత రవితేజ ఈ మూవీ లో కనిపిస్తుండడం తో ఆయన అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహ రెడ్డి. క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయడం మ్యూజిక్ సంచలనం థమన్ మ్యూజిక్ అందించడం తో ఈ మూవీ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాలను భారీ స్థాయిలో నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ రెండు చిత్రాలను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ రెండు చిత్రాలతో పాటు తమిళ్ హీరో విజయ్ నటించిన వారసుడు కూడా సంక్రాంతి బరిలో వస్తున్నప్పటికీ అందరి చూపు మాత్రం వాల్తేర్ వీరయ్య , వీరసింహ రెడ్డి లపైనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో అయితే ఈ రెండు చిత్రాల టికెట్లు రేట్లు దాదాపుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సింగిల్ స్క్రీన్స్ లలో 6 షోల వరకు ప్రదర్శించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక సినిమా విడుదల రోజు కూడా ఫాన్స్ కోసం బెన్ఫిట్ షోలు ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు. ఇక ఈ రెండు సినిమాల టికెట్ ధరలు చూస్తే.. ఏ సెంటర్లో రూ. 200 టికెట్ ధర ను ఫిక్స్ చేశారు. ఇక బీసీ సెంటర్లలో మాత్రం 150 రూపాయలకు టికెట్ ధరలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

గతంలో అయితే పెద్ద హీరో నుండి సినిమా వస్తుందంటే మొదటి మూడు రోజులు భారీగా టికెట్ ధర ఉండేది. ఈ ధరలు చూసి సినీ లవర్స్ సైతం సినిమా చూసేందుకు వెనకడుగు వేసేవారు. దీంతో కలెక్షన్లు భారీగా తగ్గడమే కాక సినిమా థియేటర్స్ లలో కూడా ప్రేక్షకులు లేక ఖాళీగా దర్శనం ఇచ్చేవి. ఇది గమనించిన నిర్మాతలు టికెట్ ధరలు తగ్గించారు. రిలీజ్ రోజు నుండి థియేటర్ నుండి బొమ్మ బయటకు వెళ్లెవరకూ ఒకే రేటు ఫిక్స్ చేసారు. అప్పటి నుండి మళ్లీ థియేటర్స్ కు ప్రేక్షకుల కళ మొదలైంది. అందుకే సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతున్న సినిమాల టికెట్స్ ధరలను సాధారణ ధరలతో రిలీజ్ చేస్తున్నారు. ఇది అభిమానులకుపెద్ద పండగే అని చెప్పాలి.

follow us