వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య ఈ రెండిట్లో ఏ ట్రైలర్ ఎలా ఉందంటే..

వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య ఈ రెండిట్లో ఏ ట్రైలర్ ఎలా ఉందంటే..

2023 సంక్రాంతి బరిలో వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య గా వస్తుంటే..నందమూరి బాలకృష్ణ వీరసింహరెడ్డి గా వస్తున్నాడు. ఈ రెండు సినిమాల ఫై మెగా , నందమూరి అభిమానుల్లోనే కాదు మాములు సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు తెరకెక్కాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. రెండు సినిమాల ట్రైలర్స్ మొత్తం యాక్షన్ తో నిండిపోయాయి. అంతే కాదు సెంటిమెంట్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది.

వీరసింహరెడ్డి ట్రైలర్ విషయానికి వస్తే.. మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేలా ఫైట్స్, ఎలివేషన్స్‌ ఉండటంతో పాటు ఏపీ రాజకీయ పరిస్థితుల్ని పరోక్షంగా బాలయ్య ప్రస్తావించారు. అలానే శృతి హాసన్, హనీ రోస్‌తో కలిసి బాలకృష్ణ వేసిన కొన్ని స్టెప్స్‌ని కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు. అంతే కాదు బాలకృష్ణ.. తండ్రి, కొడుకు రూపంలో రెండు పాత్రల్ని పోషిస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు.

అలాగే వాల్తేర్ వీరయ్య లోను యాక్షన్ మాత్రమే కాదు రొమాంటిక్ యాంగిల్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు. అలాగే ట్రైలర్ లో మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ మరో లెవల్లో ఉంది. రవితేజ ఎంట్రీనే ఇరగదీశాడు. వైజాగ్ సిటీలో అరాచకాల్ని ఆపేందుకు వచ్చే పోలీస్ కమీషనర్ గా రవితేజ కనిపించారు. ఓవరాల్ గా రెండు ట్రైలర్స్ సినిమాల ఫై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఎక్కడ కూడా ఏది తగ్గలేదు. మరి థియేటర్స్ లో ఎవరు ఫై చేయి సాధిస్తారో చూడాలి.

follow us