మెగా డ్రామా : ఏమౌతుంది మెగా కాంపౌండ్ లో

మెగా డ్రామా : ఏమౌతుంది మెగా కాంపౌండ్ లో

మెగా కాంపౌండ్ అంటే అందరికి గుర్తుకు వచ్చే పేర్లు రెండు ఒకటి చిరంజీవి ఇంకోటి అల్లు అరవింద్.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయినట్టు కనిపిస్తున్నాయి.. బావ బావమర్ది బాగానే ఉండే వాళ్ళు.. ప్రజారాజ్యం అప్పుడు కూడా కలిసే ఉన్నారు.. కానీ ఇది అంతా ఇప్పుడు పిల్లల పెత్తనం తో తెచ్చిన గ్యాప్ అ ?

ఉపాసన రామ్ చరణ్ పెళ్లి అయినా దగ్గర నుంచి కుటుంబ ఫైనాన్సియల్ లావాదేవీలు అని రామ్ చరణ్ చూసుకుంటున్నారు.. చిన్న కూతురు పెళ్లి తో చిన్నగా మెగా కాంపౌండ్ లో ఉపాసన కుటుంబం కి విలువ పెరుగుతూ వచ్చింది.. అది కాస్త ఇప్పుడు అల్లు అరవింద్ ని పూర్తిగా దూరం చేసిందని వినికిడి.. 

అల్లు అర్జున్ సినిమా కి పోటీ సరిలేరు నీకెవ్వరని చిరంజీవి కి తెలియదా ? 
సరిలేరు నీకెవ్వరు  అలానే అల వైకుంఠపుర్రం లో సినిమాలు రెండు సంక్రాంతి కి విడుదల అవ్వుతున్నాయి.. చిరంజీవి ఏలా మహేష్ బాబు సినిమా ప్రీ రిలీజ్ ఇవెంట్ కి వస్తా అని ఒప్పుకున్నాడు.. ఆలా చేస్తే అల వైకుంఠపుర్రం లో సినిమాకి పోటీ గా వచ్చినట్టే కదా.. దీనికి కారణం రామ్ చరణ్ భార్య ఉపాసన కి నమ్రత కి మధ్య ఉన్న స్నేహం అలానే రామ్ చరణ్ కి మహేష్ బాబు కి మధ్య ఉన్న స్నేహం అనుకుంటే.. బావమర్ది కొడుకు సినిమా తక్కువ అయ్యి పోయిందా.. స్టేజి మీద ఒక్క మాట కూడా అల్లు అర్జున్ ఆలా వైకుంఠపుర్రం లో సినిమా గురించి ఎందుకు మాట్లాడలేదు.. చిరంజీవి ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్..

తమ్ముడులతో కూడా దూరం గా ఉంటున్నారా ?

చిరంజీవి కి తమ్ముడులు ఇద్దరు దగ్గరగానే ఉండే వాళ్ళు.. కానీ ఒక్కసారిగా ప్రజారాజ్యం సమయం లో పవన్ కళ్యాణ్ దూరం అయ్యారు.. ఈ మధ్య మళ్ళీ దగ్గర అయినట్టు కనిపించిన కానీ జగన్ చెప్పిన మూడు రాజధానుల విషయం లో వెతిరేకించారు.. అసలు ఎవరు పోయి చిరంజీవి ని మీ అభిప్రాయం ఏంటి అని అడగలేదు.. ఆయనకు ఆయనే ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్, నాగ బాబు చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్ గా నిలబడకుండా వాళ్ళు దేని కోసం పోరాడుతున్నారో దానికి వెతిరేకం గా స్టేట్మెంట్ విడుదల చేసారు.. అంటే చిరు కి తమ్ముడులు ఇద్దరితో కూడా రిలేషన్ లేకుండా పోయిందా ?

గొడవలు చెవులో చెప్పాలి గొప్పలు మైక్ లో చెప్పాలి అంటే ఇదేనా ? చిరంజీవి మొన్న జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ లో లుకలుకలు గురించి ఈ మాట అన్నారు.. అదే ఆయన కుటుంబం విషయం లో కూడా పాటిస్తున్నారు అని అందరికి తెలుస్తుంది.. 

మెగా కాంపౌండ్ అంటే అందరూ చాలా బయపడతారు.. ఇండస్ట్రీ లో ఒక పేరు ఉంది.. ఒక శక్తీ ల చూస్తారు.. కానీ ఇలా వాళ్లలో వాళ్ళు లోపల లోపల కొట్టుకుంటే బయటకి తెలియకుండా ఉండాలి అనుకునే చిరంజీవి సరిలేరు నీకెవ్వరు  ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎందుకు రావాలి.. వచ్చిన కానీ ఎందుకు ఆయన ఒక మాట కూడా అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడకుండా వచ్చేయాలి.. తరువాత రోజు బన్నీ అంత భావోద్వేగం తో కూడిన స్పీచ్ ఎందుకు ఇచ్చారు.. నాకు చిరంజీవి తరువాతే అన్నీ అనడం వెనక ఉన్న అసలు లుకలుక ఏంటి.. చిరంజీవి అల్లు కుటుంబం ని నెగ్లెక్ట్ చేస్తున్నారా.. 

మెగా కాంపౌండ్ లో అసలు ఏం జరుగుతుంది..

Tags

follow us