టాలీవుడ్ కు పెద్ధ అన్నయ్య గా ఉన్న చిరంజీవి చుట్టూ ఎందుకు ఇన్ని కాంట్రవర్సీలు.. ఒకటి కాదు రెండు కాదు.. ఆనాటి నుంచి ఈ నాటి వరకు..
ఎంతో కూల్ గా కనిపించే చిరంజీవి చుట్టూనే ఎందుకు హీరోలు అందరికి అక్కసు.. లేక పోతే బయటకి కనిపించే చిరు లోపల ఉండే చిరు వేరు వేరా.. ఇలా ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నారు..
ఇండస్ట్రీ లో చిరు కి వేరే హీరోలకి మధ్య జరిగిన కొన్ని కాంట్రవర్సీలు..
కృష్ణ – చిరు : ఈ గొడవ అల్లూరి సీతారామరాజు సమయం లోనిది.. ఈ మధ్య ఈ గొడవ ఏమి లేదని చెప్పడానికే .. చిరు స్టేజి మీద ‘మేము మేము ఎప్పుడు ఒక్కటే ‘ అంటూ చెప్పారు కూడా..
మోహన్ బాబు – చిరంజీవి : వజ్రోత్సవం సమయం లో వీరి ఇద్దరి మధ్య చాలా పెద్ధ గొడవనే జరిగింది.. కానీ చివరకు కలిసినట్టే కనిపిస్తున్నారు..
రాజశేఖర్ – చిరంజీవి : ‘మా’ ప్రెస్ మీట్ స్టేజి మీద రాజశేఖర్ డైరెక్ట్ గానే చిరు ను తిట్టేసారు, తర్వాత సారీ చెప్పారనుకోండి , కానీ ఇప్పటికి కలవలేదు..
బాలకృష్ణ – చిరంజీవి : ఇది ఎప్పటి నుంచో ఉన్న…. ఈ మధ్య బాలయ్య బాబు కామెంట్స్ తో ఆజ్యం పోసినట్టు అయ్యింది..
కొన్ని గాషిప్స్ చిరంజీవి చుట్టూ :
హీరో సుమన్ , హీరో ఉదయ్ కిరణ్ కారియర్ కి ఇష్యూ కలిగించారని.. ఇలా చాలానే కాంట్రవర్సీలు చిరంజీవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి..
ప్రజారాజ్యం పార్టీ సమయంలో అయితే ఇంకా ఎన్నో.. తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనే గొడవలు అంటూ వార్తలు వచ్చాయి..
ఇవి అన్ని ఇలా ఉన్న.. చిరంజీవి మాత్రం ఎప్పుడు కూల్ గా గొడవలు లేకుండా బయటకి కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు..
కానీ తమ్ముడు నాగ బాబు మాత్రం చిరు బయటకి చెప్పే వాటికీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు.. ఒక గొడవను ఆపేయాలని అనుకున్న అప్పుడు చిరంజీవి ఎందుకు రక్తసంబంధీకులకు ఆ విషయం గురించి పబ్లిక్ గా మాట్లాడవద్దని చెప్పారు..
ఏన్ని వార్తలు వచ్చిన మెగాస్టార్ అంటే టాలీవుడ్ కు ఒక ఎనర్జీ.. ఒక మెగా హీరో అంటే చుట్టూ అసూయా తో కాంట్రవర్సీలు గొడవలు చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు కదా.