శ్రీకారం కు నాని ఎందుకు నో చెప్పాడు.?

శ్రీకారం సినిమాకు మొదట హీరోగా నాచురల్ స్టార్ నానిని హీరోగా అనుకున్నారు. అంతే కాకుండా సినిమా స్క్రిప్ట్ ను కూడా ఆయనకు వివరించారు. ఈ సినిమా కథ రైతులు ఎదురుకుంటున్న కష్టాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. సినిమాలో ఒక ఐటీ ప్రొఫెషన్ లో మంచి పొజిషన్ లో ఉన్న యువకుడు తన సొంతూరుకు వెళ్లి నూతన విధానాలతో వ్యవసాయం ఎలా చెశాడు. అన్నదాన్ని సినిమాలో చూపించారు. అయితే ఈ పాత్రలో నాని తనను తాను ఊహించుకోలేక పోయాడట. అందుకే ఈ సినిమాకు నో చెప్పాడట.
దాంతో మేకర్స్ అదే స్క్రిప్ట్ ను తీసుకుని హీరో శర్వానంద్ దగ్గరకు వెళ్లారు. స్టోరీ భాగా నచ్చడంతో శర్వానంద్ ఓకే చెప్పేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నేడు విడుదల కానుంది. సినిమాకు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు మెగాస్టార్, రాంచరణ్, కేటీఆర్ లాంటి వాళ్లు వచ్చి సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా సినిమా కథ మహర్షి సినిమా స్టోరీకి దగ్గరగా ఉందన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు విడుదలవుతున్న శ్రీకారం ఎలా ఉంటుందో చూడాలి.