30 సం|| యువ కిరణాలు ఎందుకు ఇలా ప్రాణాలు కోల్పుతున్నారు..

జీవితం లో సక్సెస్ రావడం తో పాటు దాన్ని కోల్పోయినప్పుడు నిలబడిన వాడే స్థిరమైన మనిషి..
ఒక సమయంలో చేతి నిండా పని.. చేతి నిండా డబ్బులు.. తిరిగి చూసుకునే టైం కూడా ఉండదు.. అంత అయ్యిపోయి తిరిగి చూసే సమయానికి.. చేతిలో పని ఉండదు , డబ్బులు ఉండవు.. ఈ సమయాన్ని కొంత కాలం మాత్రమే భరించగలరు.. అంత కన్నా తట్టుకోలేక ప్రాణాలు వదిలి పోతున్నారు..
ఉదయ్ కిరణ్ ప్రాణాలు పోవడానికి ఇదే కారణం..
మొన్న తమిళ నాడు లో బాల మిత్రన్.. సక్సెస్ ఫెయిల్యూర్ లో వచ్చే ప్రెషర్ తట్టుకోలేక పక్షవాతం, తరువాత హార్ట్ ఎటాక్..
ఇప్పుడు బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజపుట్..కేవలం కొన్ని రోజులు భరించలేక ఇలా ప్రాణాలు తీసుకుంటే ఎవరి జీవితం పోగొట్టుకున్నట్టు…
అందుతున్న సమాచారం ప్రకారం సుశాంత్ చేతిలోపెద్ధ సినిమాలు ఏవి లేవు.. అలానే నిర్మాతలకు ఈయనకు మధ్య సంబంధాలు బాగాలేవని వార్తలు వస్తున్నాయి.. ఇంకా ఇండస్ట్రీ లో తనకు మంచి ఆఫర్స్ లేవని బాధ.. స్టార్ ధమ్ అనుభవించి లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్నారు, అలాగే ఆరు నెలలుగా డిప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇవి అన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారా అని అనుమానాలు వ్యక్తం అవ్వుతున్నాయి..
30 ఏళ్ళ నిండకముందే సక్సెస్ రావడం.. తరువాత వచ్చే ఒడిదుడుకులు ను ఎదురుకోలేక ఇలా ప్రాణాలు తీసుకోవడం బాధకరం..