సరిలేరు నీకెవ్వరు పాటలు ఎందుకు విడుదల చేయడం లేదు .. ?

  • Written By: Last Updated:
సరిలేరు నీకెవ్వరు పాటలు ఎందుకు విడుదల చేయడం లేదు .. ?

మహేష్ బాబు సంక్రాతి కి రిలీజ్ అవ్వబోతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు .. టీం టీజర్ కూడా విడుదల చేసింది. అనుకున్న అంత బజ్ రాకపోయినా సినిమా కి అయితే ప్రొమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.. ఫ్యాన్స్ కి ఒక వీడియో అంటూ దొరికింది.. దీనికి పోటీ గా విడుదల అవ్వుతున్న సినిమా అల వైకుంఠపురం లో  పాటలు, పోస్టర్స్  ప్రతి చిన్న దాన్ని పండగల సెలెబ్రేట్ చేసుకుంటున్నారు… మరి ఎందుకు సరిలేరు నీకెవ్వరు టీం వాళ్ళు పాటలు విడుదల చేయడం లేదు.. 

దర్శకుడు అనిల్ రావిపూడి ముందు సినిమాలు చూస్తే సుప్రీం, పటాస్, రాజా ది గ్రేట్  మరుగు ఆఫ్ 2 ఏవి ఆయన సినిమాలు, అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలిచాయి.. కానీ ఒక్క సినిమా లో కూడా చెప్పుకోడానికి ఒక మంచి పాట కూడా లేదు.. రీమిక్స్ ల తో వచ్చిన ఒకటి రెండు తప్ప.. మరి మహేష్ బాబు సినిమా కి కూడా ఇదే ఇబ్బంది పడుతున్నాడు దర్శకుడు అని ఆయన దగ్గర వర్గం మాట్లాడుకుంటున్నారు.. 

ఇది ఒక రకంగా మహేష్ బాబు ఫ్యాన్స్ బాధ పడే విషయమే.. కానీ అనిల్ రావిపూడి కి ఒక ప్లాప్ కూడా లేదు.. అది మాత్రం 100% ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇచ్చే విషయం.. ఎంత స్టార్ దమ్ము ఉన్న యాక్టర్స్ ఉన్న కానీ సినిమా సరిగ్గా తీయక పోతే ప్రేక్షకులు ఆదరించడం కష్టమే .. స్పైడర్,  బ్రహ్మోత్సవం లతో ఇది మహేష్ బాబు కి కూడా తెలిసిన విషయమే.. పాటలు ఎలా ఉన్న కానీ సినిమా బాగా వచ్చింది అని తృప్తి చెందుతుంది అంట టీం.. 

follow us

Web Stories