పోలీసుల మీదే దాడికి దిగిన బెల్ట్ షాపులు యజమానులు

Vijayawada belt shops
Vijayawada belt shops

వైస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యపానం నిషేధాన్ని అమలుచేసి , ప్రభుత్వంమే బెల్ట్ షాపు లను ఓపెన్ చేసింది . ఈ క్రమంలో గ్రామాల్లో బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపొతుంది .

పోలీసులకు అందిన సమాచారంతో కృష్ణ జిల్లా పుల్లపాడు గ్రామంలో స్థానిక ఎక్సైజ్ శాఖ, పోలీస్ విభాగం అక్రమంగా మద్యం విక్రయిస్తున్నషాపుల పై తనిఖీలు జరిపింది . తనిఖీల్లో బెల్ట్ షాపుల యజమానులు మూకుమ్మడిగా పోలీసులపై దాడులు జరిపారు , దాడుల్లో ముగ్గురు కానిస్టేబుల్స్ , ఒక ఎస్సై కి గాయాలపాలయ్యారు . దాడిని తట్టుకోలేక పోలీసులు తిరుగుమొహం పట్టారు.

దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . అక్రమంగా మద్యం అమ్ముతున్నందుకు , డ్యూటీలో ఉన్న పోలిసుల మీద దడి జరిపినందుకు గాను వీరిపై కేసులు నమోదు చేసారు.