బెంగళూరులో మళ్లీ కలకలం..ఈసారి మరో యువతి !

Woman detained in Bengaluru for holding Kashmiri Liberation poster
Woman detained in Bengaluru for holding Kashmiri Liberation poster

బెంగళూరులో మళ్లీ కలకలం చెలరేగింది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సభలో అమూల్య అనే యువతి పాకిస్థాన్ జిందాబాద్‌ అంటూ  చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హిందూ జాగరణసమితి ఆందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో ఆరుద్ర అనే యువతి కాశ్మీర్ ముక్తి, దళిత ముక్తి, ముస్లిం ముక్తి అని కన్నడలో రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసింది. దీంతో హిందూ జాగరణ సమితి సభ్యులు ఆమెపై దాడి చేయబోయారు. పోలీసులు వెంటనే ఆమెను వారి నుంచి తప్పించి కస్టడీలోకి తీసుకున్నారు. ఇక మరోపక CAA వ్యతిరేక సభలో పాక్ అనుకూల నినాదాలు చేసిన అమూల్యకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జై పాకిస్థాన్ నినాదాలు చేసినందుకు ఆమెపై దేశ ద్రోహం కేసు పెట్టారు బెంగళూరు పోలీసులు. అమూల్యకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప. మరోవైపు అమూల్య వ్యాఖ్యలకు నిరసనగా ఆమె ఇంటిపై కొంతమంది దాడికి పాల్పడ్డారు..