వైస్ జగన్ పై అవినీతి కాల్ సెంటర్ లోఫిర్యాదు..

ys jagan launches helpline for anti corruption
ys jagan launches helpline for anti corruption

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ అవినీతి నిర్ములనపై అవినీతి కాల్ సెంటర్ ప్రారంభించారు . 14400 నెంబర్ కి కాల్ చేసి మీ ఫిర్యాదును నమోదుచేసుకోవచ్చు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది . వైస్ జగన్ అధికారం రాకముందే చెప్పారు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రము గా తీర్చిదిద్దుతానని , ఇచ్చిన ఒక్కక్క వాగ్ధాన్ని వైస్ జగన్ ఆచరణలో పెడుతున్నారు . అయితే దేనికి పై ప్రతిపక్ష నాయకులు స్పందన ఇలా ఉంది . 

టీడీపీ నేత వర్ల రామయ్య..

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కాల్ సెంటర్ కి ఫిర్యాదు నమోదు చేశారు. విచిత్రం ఏమిటి అంటే వర్ల రామయ్ ఫిర్యాదు  తన  ఫిర్యాదు ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేశారు .

వైఎస్ జగన్ అక్రమాల ఆస్తులపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని కోరారు వర్ల రామయ్య.  వర్ల ఫిర్యాదు చేయడం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో లో చర్చగా మారింది.

నారా లోకేష్  :

వైస్ జగన్ గారి స్టాండ్ అప్ కామెడీ అదిరిపోయింది. అవినీతికి అమ్మా, నాన్న కూడా తానే అయిన జగన్ గారు అవినీతిని నిర్ములిస్తా అని స్టేట్ మెంట్ ఇవ్వడం కన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా?

జగన్ గారి అవినీతి పై ప్రపంచంలో ఉన్న ఉత్తమ సంస్థలు, యూనివర్సిటీలు అధ్యయనం చేసి, జగన్ గారి అవినీతి కీర్తి గురించి ప్రపంచ దేశాల్లో కేస్ స్టడీగా చెబుతుంటే… ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పై అధ్యయనం చేయిస్తానని అనడం ఏంటి కామెడీ కాకపోతే!

అంతా బ్రహ్మాండంగా ప్లాన్ చేసారు, పబ్లిసిటీ పీక్స్ కి వెళ్లింది. కానీ చిన్న తప్పు చేసి దొరికిపోయారు. ”మా నాన్న నిజాయితీపరుడు, మరి మీ నాన్న?” అని ఉన్న ప్లకార్డుని పక్కనున్న అధికారితో పట్టించిన జగన్ గారు, తాను పట్టుకునే ధైర్యం చేయలేకపోయారు.