మెగా హీరో సినిమాకు షర్మిల సపోర్ట్..!

  • Written By: Last Updated:
మెగా హీరో సినిమాకు షర్మిల సపోర్ట్..!

టాలీవుడ్ లోకి మరో మెగా హీరో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తుండగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి దూరపు చుట్టం పవన్ కొణిదెల కూడా రెడీ అయ్యాడు. “కథలో పాత్రలు కల్పితం ” అనే సినిమాతో పవన్ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఒక మిస్టరీని ఛేదించే కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోంది. పోలీసులు హీరో మధ్య మిగతా కథ సాగుతుంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లిరికల్ వీడియోను రేపు షర్మిల చేతులమీదగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇదిలా ఉండగా ఇప్పటికే షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ బెట్టబోతున్నట్టు ప్రకటించి రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దానికోసం నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. ఇక ఇప్పుడు మెగా హీరో సినిమాను సపోర్ట్ ఇవ్వడంతో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. నిజానికి మెగా ఫ్యామిలీకి వైసీపీ కి రాజకీయాల పరంగా పెద్దగా టచ్ ఉండదు కానీ షర్మిల సపోర్ట్ ఇస్తుండటం ఆసక్తికరమైన విషయమే.

follow us

Related News