పీఎస్‌ను పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు..! మరి చంద్రబాబును పట్టుకుంటే..?

  • Written By: Last Updated:
పీఎస్‌ను పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు..! మరి చంద్రబాబును పట్టుకుంటే..?

ఏపీ, తెలంగాణకు చెందిన మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ కంపెనీలతో పాటు దేశంలోని ఆరు సిటీల్లో చేసిన సోదాలకు సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది ఆదాయపన్నుశాఖ… ఈ సోదాల్లో రూ.2 వేల కోట్ల నిధుల మళ్లింపు జరిగినట్టు బయటపడిందని.. తమ సోదాల్లో రూ.85 లక్షల క్యాష్, రూ.71 లక్షల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. అదే విధంగా 25కు పైగా బ్యాంకు లాకర్ల లావాదేవీలకు స్తంభింపజేసినట్టు తెలిపింది. అయితే, ఐటీ అధికారుల సోదాల్లో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి… ‘పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయి.. మరి చంద్రబాబును పట్టుకుంటే.. ఎన్ని వేల కోట్లో..! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి?’ అంటూ ట్విట్టర్‌లో చంద్రబాబును ప్రశ్నించారు సజ్జల.

Tags

follow us