బడ్జెట్ : విజయసాయి రెడ్డి బాగోలేదని అంటే, రఘురామ కృష్ణంరాజు బాగుందని..

కేంద్రం నిన్నటి రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి, మత్స్య పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా ఉన్నది. అయితే, రాష్ట్రాలకు పెద్దగా ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించలేదు. ప్రత్యేక ప్రాజెక్టులను కేటాయించలేదు. ఈ బడ్జెట్ పై వైకాపా ప్రభుత్వం ఫైర్ అయ్యిన సంగతి తెల్సిందే. అటు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
కానీ, వైకాపా పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం బడ్జెట్ పై ప్రశంసలు కురిపించారు. రైతుల శ్రేయస్సుకు ఉపయోగపడేలా బడ్జెట్ ఉందని, మత్య్స పరిశ్రమలను ఆదుకునేలా, మత్య్స రంగం అభివృద్ధి జరిగేలా బడ్జెట్ ఉందని కితాబిచ్చారు. విజయసాయి రెడ్డి బాగోలేదని అంటే, రఘురామ కృష్ణంరాజు బాగుందని చెప్పడంతో అయన వైకాపాకు దూరం అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో కూడా అయన బీజేపీ ముఖ్యనేతలతో టచ్ లో ఉండటంతో ఇలాంటి అనుమానాలే కలిగాయి. తనకు కేంద్రంలో అనేకమంది పెద్దలు స్నేహితులుగా ఉన్నారని, రాజకీయాలు వేరు,స్నేహం వారు అని చెప్పిన సంగతి తెలిసిందే.